![]() |
![]() |
.jpg)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి అచ్చొచ్చిన కథానాయికల్లో భూమికా చావ్లా ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం `సింహాద్రి` (2003) తెలుగునాట ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆపై ఈ ఇద్దరూ `సాంబ` (2004)లో జంటగా అలరించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే.. త్వరలో తారక్, భూమిక మరోసారి కలిసి నటించబోతున్నారట. అయితే, ఇందులో భూమిక నాయిక కాదు. ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. ఆ వివరాల్లోకి వెళితే.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో `జనతా గ్యారేజ్` (2016) వంటి బ్లాక్‌బస్టర్ తరువాత తారక్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో పట్టాలెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే ఓ పాత్ర ఉందట. అందులో భూమిక దర్శనమివ్వనున్నారని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం భూమిక చేతిలో `సీటీమార్`, `ఇది మా కథ` వంటి తెలుగు చిత్రాలు ఉన్నాయి. అలాగే తమిళంలో `కన్నై నంబాదే`, హిందీలో `ఆపరేషన్ మజ్ను` సినిమాలు చేస్తున్నారామె. వీటన్నింటిలోనూ అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో కనిపించనున్నారు భూమిక.
![]() |
![]() |