![]() |
![]() |
.jpg)
1970ల్లో వరుస దోపిడీలు, దొంగతనాలతో సామాన్య ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గజదొంగ.. టైగర్ నాగేశ్వరరావు. స్టువర్ట్ పురానికి చెందిన ఈ టైగర్ కథకు తెరరూపం ఇవ్వాలని కొన్నాళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. `దొంగాట`(2015), `కిట్టు ఉన్నాడు జాగ్రత్త` (2017) చిత్రాల దర్శకుడు వంశీ కృష్ణ డైరెక్షన్ లో అభిషేక్ అగర్వాల్ ఈ బయోపిక్ ని నిర్మించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఆ మధ్య ఈ బయోపిక్ లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైటిల్ రోల్ లో నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇప్పుడీ కథ మాస్ మహారాజా రవితేజ చెంతకు చేరిందట. కథని తీర్చిదిద్దిన విధానం నచ్చడంతో రవితేజ ఈ ప్రాజెక్ట్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ బయోపిక్.. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనుందని వినికిడి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
కాగా, రవితేజ ప్రస్తుతం `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీటిలో `ఖిలాడి` తుదిదశ చిత్రీకరణలో ఉండగా.. `రామారావు ఆన్ డ్యూటీ` ఇటీవలే పట్టాలెక్కింది.
![]() |
![]() |