![]() |
![]() |

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాట రాశారంటూ ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తోన్న 'వరుడు కావలెను' చిత్రంలో ఆయన "దిగు దిగు దిగు నాగ" అంటూ ఓ పాట రాశారు. ఇటీవల ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయగా మంచి పాపులర్ అయ్యింది. అయితే ఈ పాటలో నాగదేవతను కించపరిచారంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా నాయకురాలు బిందురెడ్డి ఆరోపించారు. అనంత్ శ్రీరామ్‌తో పాటు ఆ సినిమా దర్శక నిర్మాతలపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ నెల్లూరులోని చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తమన్ సంగీతం సమకూర్చిన ఈ పాటను హీరోయిన్ రీతు వర్మ, డాన్సర్ల బృందంపై చిత్రీకరించారు. లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
అనంత శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే సినీ సాహిత్యంపై ఆసక్తితో గేయరచయితగా పరిచయమై, పలు సినిమాల్లో సూపర్‌హిట్ సాంగ్స్‌ను రాస్తూ వచ్చారు. భాషపై మంచి పట్టు ఉన్న ఆయనలో దైవభక్తి ఎక్కువే. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు దేవుళ్లను కించపరిచేవిధంగా పాట రాశారంటూ కేసు నమోదు కావడం ఆశ్చర్యకరం.
![]() |
![]() |