![]() |
![]() |

టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు బ్యూటీలు రష్మికా మందన్న, రాశీ ఖన్నా వర్కవుట్స్ చేస్తున్న సందర్భంగా కెమెరాకు జాయింట్‌గా పోజిచ్చారు. జిమ్‌లో తీసిన ఆ ఫొటోలో ఇద్దరు తారలూ బ్లాక్ కలర్‌పై డిజైన్లు ఉన్న స్కిన్ టైట్ ప్యాంట్ ధరించి, తమ ఫిట్‌నెస్ ఎలాంటిదో ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటో తీసిందెవరో తెలుసా? నటుడు నవదీప్. అతను ఫొటో తీస్తున్న విషయం ఎదురుగా ఉన్న అద్దంలోంచి మనకు కనిపిస్తోంది.
ఏడేళ్ల క్రితం టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పుడు రాశీ ఖన్నా కాస్త బొద్దుగా కనిపించేది. అప్పట్నుంచీ క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తూ మంచి ఫిట్‌నెస్‌ను సాధించింది అమ్మడు. ఈ వర్కవుట్స్‌కు చెందిన వీడియోలు, ఫొటోలను రెగ్యులర్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను రంజింపజేస్తోంది.
మరోవైపు 'ఛలో' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన దగ్గర్నుంచీ కూడా సన్నటి లుక్‌తోనే కనిపిస్తూ వస్తున్న రష్మిక ఫిట్నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తోంది. ఎక్కడా ఎక్స్‌ట్రా ఫ్యాట్ అనేది లేదన్నట్లు ఫిగర్‌ను మెయింటైన్ చేస్తోంది.
రష్మిక, రాశీ ఇద్దరూ ఒకే జిమ్‌కు వెళ్తూ వర్కవుట్స్ చేస్తున్నారు. అదే జిమ్‌కు నవదీప్, మరికొంతమంది యాక్టర్లు కూడా వెళ్తున్నారు. ఒకవైపు సీరియస్‌గా వర్కవుట్స్ చేస్తూనే, మరోవైపు సరదాగా కూడా గడుపుతున్నారు. అందుకు ఈ ఫొటోయే నిదర్శనం.
సినిమాల విషయానికి వస్తే రష్మిక తెలుగులో 'పుష్ప', 'ఆడవాళ్లు మీకు జోహార్లు', హిందీలో మిషన్ 'మజ్ను', 'గుడ్‌బై' సినిమాలు చేస్తోంది. రాశీ ఖన్నా తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్ యు', తమిళంలో 'అరణ్మణి 3', 'తుగ్లక్ దర్బార్' సహా మరో రెండు మూడు సినిమాలు చేస్తోంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో ఓ వెబ్ సిరీస్‌ను ఇటీవలే ప్రారంభించింది.
![]() |
![]() |