![]() |
![]() |

నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'లవ్ స్టోరీ'. 'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల-సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'లవ్ స్టోరీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సారంగ దరియా పాటకు విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో మరో రికార్డు సృష్టించింది.
ఐదు నెలల కింద యూ ట్యూబ్‌లో విడుదలైన సారంగ దరియా లిరికల్ వీడియో 300 మిలియన్ మార్క్ ని దాటింది. ఓ లిరికల్ వీడియోకి అతి తక్కువ సమయంలో ఇన్ని వ్యూస్ లభించడం అనేది సౌత్ లో ఇదే మొదటిసారి అంటున్నారు. గతంలో శేఖర్ కమ్ముల-సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా మూవీలోని వచ్చిండే సాంగ్ కూడా రికార్డ్ వ్యూస్ ని సాధించింది. అయితే ఇప్పుడు సారంగ దరియాకు దానిని మించిన ఆదరణ లభిస్తుండటం విశేషం. లిరికల్ వీడియోతోనే రికార్డు వ్యూస్ సాధించిన ఈ సాంగ్.. వీడియో సాంగ్ వచ్చాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో.
తెలంగాణ ఫోక్ సాంగ్ ని ప్రేరణగా తీసుకుని ఈ సాంగ్ ని రూపొందించారు. సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాయగా మంగ్లీ ఆలపించారు. పవన్ సిహెచ్ ఈ పాటకు సంగీతం అందించారు. సాహిత్యం, సంగీతం, గానం అన్ని కుదరడంతో ఈ పాట పెద్ద హిట్ అయింది. ఇక ఈ లిరికల్ వీడియోస్ సాయి పల్లవి వేసిన స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
![]() |
![]() |