![]() |
![]() |

తెలుగునాట పోలీస్ పాత్రలకి వన్నె తెచ్చిన కథానాయకుల్లో విక్టరీ వెంకటేశ్ ఒకరు. ఆయన నటించిన పవర్ ఫుల్ కాప్ డ్రామాల్లో `ఘర్షణ` చిత్రం ఒకటి. తమిళనాట అఖండ విజయం సాధించిన `కాక్క కాక్క`(సూర్య, జ్యోతిక)కి రీమేక్ గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని.. మాతృక దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించారు. డీసీపీ రామచంద్ర (వెంకటేశ్) అనే ఓ ఐపీఎస్ ఆఫీసర్ జీవితంలో చోటుచేసుకున్న పలు ఘటనల సమాహారమే `ఘర్షణ` చిత్రం. వెంకీకి జోడీగా అసిన్ నటించిన ఈ సినిమాలో సలీమ్ బైగ్, రవిప్రకాశ్, డేనియల్ బాలాజీ, వంశీ కృష్ణ, సత్యం రాజేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించగా.. యానా గుప్తా ప్రత్యేక గీతంలో మెరిసింది.
హేరిస్ జైరాజ్ సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``చెలియ చెలియా`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``ఏ చిలిపి కళ్ళలోని కలవో``, ``నన్నే నన్నే చూస్తూ``, ``అందగాడా``, ``ఆడతనమా`` గీతాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. గీతా చిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై జి. శివరాజు, సి. వెంకట్రాజు నిర్మించిన `ఘర్షణ`.. 2004 జూలై 30న జనం ముందు నిలిచింది. నేటితో ఈ సక్సెస్ ఫుల్ కాప్ డ్రామా 17 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |