![]() |
![]() |

తెలుగు చిత్రసీమలోని గొప్పనటుల్లో మోహన్‌బాబు ఒకరు. 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన పేరు తెలియన తెలుగువాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. కెరీర్ మొదట్లో విలన్ పాత్రల్లో అద్భుతంగా రాణించి, ఆ తర్వాత అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగి, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే తనకు తానే సాటి అనిపించుకున్న నటుడాయన. మోహన్‌బాబు మొదట విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు.. లక్ష్మీప్రసన్న, విష్ణు. దురదృష్టవశాత్తూ విద్యాదేవి మృతి చెందడంతో, ఆమె చెల్లలు నిర్మలాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు మోహన్‌బాబు. వారికి మనోజ్‌కుమార్ పుట్టాడు. తండ్రి బాటలో ముగ్గురు పిల్లలూ నటులయ్యారు. మొదట విష్ణు, తర్వాత మనోజ్ హీరోలుగా పరిచయం కాగా, చివరగా లక్ష్మీప్రసన్న విలన్ రోల్‌తో తెరంగేట్రం చేయడం విశేషం.

గురువారం మోహన్‌బాబు, నిర్మలదేవి పెళ్లిరోజు. ఈ సందర్భంగా మనోజ్ ఆ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వారి బ్లాక్ అండ్ వైట్ పెళ్లి ఫొటోను, ఇటీవలి కాలంలో జంటగా దిగిన ఫొటోను షేర్ చేసిన మనోజ్, "మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లవ్ యు లోడ్స్ అమ్మ, నాన్న" అని రాసుకొచ్చాడు.

లక్ష్మి కూడా నిర్మలను ఎన్నడూ తన చిన్నమ్మగానో, సవతితల్లిగానో చూడలేదు. తన కన్నతల్లి లాగానే ఆమెను ప్రేమిస్తుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యండిల్ ద్వారా అమ్మానాన్నలతో దిగిన ఫొటోను షేర్ చేసిన లక్ష్మి, "Happy Wedding Anniversary to you two kids!" అని శుభాకాంక్షలు తెలియజేసింది. "కొత్తగా పెళ్లి చేసుకున్నవారిలా ఇప్పటికీ మీరు ఫైట్ చేసుకుంటారు. ఎన్ని కష్టాలెదురైనా కలిసుండటమనే దానికి అర్థాన్ని బోధిస్తుంటారు. మీకెప్పటికీ తెలియనంతగా మీ ఇద్దర్నీ ప్రేమిస్తున్నా" అని రాసుకొచ్చింది.
.jpg)
![]() |
![]() |