![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సోషల్ డ్రామాలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించబోతున్నారు చిరు. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే మోహన రాజా దర్శకత్వంలో `లూసిఫర్` రీమేక్ ని పట్టాలెక్కించబోతున్నారు. ఆగస్టు 13 నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందని ప్రచారం సాగుతోంది.
కాగా, కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలోనూ మెగాస్టార్ ఓ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో చిరు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. మరో స్టార్ హీరో కూడా ఇందులో కనిపిస్తారని, కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించబోతోందని వినికిడి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. అక్టోబర్ నుంచి చిరు - బాబీ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందట. ఆపై శరవేగంగా సినిమాని పూర్తిచేసి 2022 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది.
చిరంజీవి - బాబీ కాంబినేషన్ మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తయింది. మరి.. మెగాస్టార్ కాంబినేషన్ లో బాబీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |