![]() |
![]() |
.jpg)
వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటిస్తోన్న చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తార సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నా అంగీకరించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. "వరుణ్‌తేజ్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ గ్రేట్ ఫన్. అతనితో డాన్స్ నంబర్ చేయడానికి ఎదురుచూస్తున్నా. నిజంగా ఆ సాంగ్ చాలా క్యాచీగా ఉంటుంది. కథలో ఒక ఆసక్తికర ఘట్టంలో ఆ సాంగ్ వస్తుంది." అని చెప్పింది తమన్నా. తమన్ ట్యూన్స్ ఇచ్చిన ఈ సాంగ్‌కు షాజియా సాంజీ, పీయుష్ భగత్ సంయుక్తంగా కొరియోగ్రఫీ అందించనున్నారు.
వరుణ్‌తేజ్, తమన్నా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'ఎఫ్ 2'లో కలిసి నటించారు. అందులో వరుణ్ వదినగా, వెంకటేశ్ భార్యగా తమన్నా నటించింది. ఇప్పుడు మరోసారి అవే పాత్రల్లో వారు 'ఎఫ్ 3'లో నటిస్తున్నారు. తెలుగులో తమన్నా పలు సినిమాలతో బిజీగా ఉంది. నితిన్‌తో కలిసి నటించిన 'మేస్ట్రో', గోపీచంద్ జోడీగా నటించిన 'సీటీమార్', సత్యదేవ్ సరసన చేసిన 'గుర్తుందా శీతాకాలం' సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా విడుదల కానున్నాయి.
ఇవి కాకుండా బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీతో 'బోల్ చుడియా' సినిమా చేస్తోంది తమన్నా. అలాగే జెమినీ టీవీ కోసం 'మాస్టర్ చెఫ్ ఇండియా' తెలుగు వెర్షన్‌కు హోస్ట్‌గా చేస్తోంది. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతోంది.
![]() |
![]() |