Home

»

Latest News

ఇండియాలో 'ద సూసైడ్ స్క్వాడ్' రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

Jul 28, 2021 10:35AM

 

జేమ్స్ గ‌న్ డైరెక్ట్ చేసిన 'ద సూసైడ్ స్క్వాడ్' మూవీని భార‌త్‌లో ఆగ‌స్ట్ 5న ఎంపిక చేసిన సినిమాహాళ్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ పిక్చ‌ర్స్ వెల్ల‌డించింది. ఈ డీసీ సూప‌ర్‌హీరో యాక్ష‌న్ అడ్వంచ‌ర్ ఫిల్మ్‌లో మార్గోట్ రాబీ, ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, సిల్వెస్ట‌ర్ స్టాలోన్‌, వ‌యోలా డేవిస్ స‌హా ప‌లువురు పేరుపొందిన తార‌లు న‌టించారు. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ మ‌రో యాక్ష‌న్ ఫాంట‌సీ ఫిల్మ్ 'మోర్ట‌ల్ కంబాట్' జూలై 30న సెల‌క్ట్ చేసిన కొన్ని థియేట‌ర్ల‌లో విడుద‌లవుతోంది. 

గ‌తంలో ఈ సినిమా ఏప్రిల్ 23న కేర‌ళ‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో విడుద‌లైంది. అయితే అప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో, తిరిగి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఆగ‌స్ట్ 13న హార‌ర్ మిస్ట‌రీ 'ద కంజూరింగ్‌: ద డెవిల్ మేడ్ మి డెవిల్ డు ఇట్‌'ను ఎంపిక చేసిన న‌గ‌రాల్లో వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ విడుద‌ల చేయ‌నున్న‌ది. ఈ మూవీలో పాట్రిక్ విల్స‌న్‌, వెరా ఫ‌ర్మిగా ప్ర‌ధాన పాత్ర‌ధారులు.

కొవిడ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హ‌ర్యానా, గుజ‌రాత్ లాంటి రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెర‌వ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ సోమ‌వారం ఢిల్లీలో 50 శాతం సీట్ల సామ‌ర్థ్యంతో థియేట‌ర్ల‌ను తెరిచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జూలై 30న స‌త్య‌దేవ్ మూవీ 'తిమ్మ‌రుసు', తేజ స‌జ్జా సినిమా 'ఇష్క్' థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్నాయి. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన 'ఎస్ఆర్ క‌ల్యాణ‌మంట‌పం' ఆగ‌స్ట్ 6న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com