![]() |
![]() |

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు పెన్ స్టూడియో అధినేత జయంతిలాల్ గడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల క్రితం జయంతిలాల్ తన ఆఫీస్ లో కుప్పకూలిపోయారని సమాచారం. ఆయనకు హార్ట్ సర్జరీ జరిగినట్టు, వైద్యులు ఆయన గుండెలో పేస్‌మేకర్‌ను ఏర్పాటు చేశారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
జయంతిలాల్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు ధవళ్ గడా స్పందించారు. ధవళ్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ఆఫీస్ లో కుప్పకూలిపోయారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు. అయితే ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, ఆయనకు హార్ట్ లో పేస్‌మేకర్‌ను ఏర్పాటు చేసినట్లు అంగీకరించారు. తన తండ్రి ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ధవల్ పేర్కొన్నారు.
జయంతిలాల్ ప్రస్తుతం పలు భారీ చిత్రాలకు నిర్మాతగా, పంపిణీదారుడుగా వ్యవహరిస్తున్నారు. ఆ జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్, గంగూబాయి కతియావాడి, బెల్ బాటమ్, ఛత్రపతి హిందీ రీమేక్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.
![]() |
![]() |