![]() |
![]() |

'ఉప్పెన' సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు లైన్ లో ఉండగా.. తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్ తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల దర్శకుడు దశరథ్ కథ అందిస్తున్నారని సమాచారం. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ హీరోగా 'ఏజెంట్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయనున్నాడని అంటున్నారు.
ఇక వైష్ణవ్ తేజ్ క్రిష్ డైరక్షన్ లో ఓ సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశయ్య డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయనున్నాడు.
![]() |
![]() |