![]() |
![]() |

నెల్లూరు దగ్గర హైవేపై రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేశ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నిన్న తెల్లవారుజామున ప్రమాదానికి గురైనప్పుడు ఆయన తలకు, కంటికి బలమైన గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు. మొదట ఆయనను నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స చేశాక, మరింత మెరుగైన వైద్యం కోసం ఆయనను శనివారం సాయంత్రం చెన్నై అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
ప్రస్తుతానికి ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అందిన సమాచారం ప్రకారం ఆయన ముక్కు ఎముక విరిగింది. కంటిపాపకు గాయమైంది. మెదడుకు ఏ మేరకు గాయం (డిఫ్యూజ్ ఆక్సనల్ ఇంజ్యురీ) అయ్యిందీ పరిశీలిస్తున్నారు. మెదడు గాయం వల్ల తదుపరి కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి ఏంటనేది డాక్టర్లు ఇంకా నిర్ధారణకు రాలేదు. శ్వాస సరిగా లేకపోవడంతో వెంటిలేటర్ మీదే ఉంచారు.
శంకర్ నేత్రాలయ నుంచి వచ్చిన వైద్యులు మహేశ్‌ను పరిశీలించి, కార్నియోఫేసియల్ రికన్‌స్ట్రక్షన్ ఆపరేషన్ అవసరమని తెలిపినట్లు తెలిసింది. అంటే మొదట ఆ ఆపరేషన్ ద్వారా బోన్ స్ట్రక్చర్ రికన్‌స్ట్రక్ట్ చేసి, కంటి ఆపరేషన్ చేస్తారు. కంటి చూపుకు సమస్య ఉండకపోవచ్చని డాక్టర్లు తెలిపినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం ఆయనకు కార్నియోఫేసియల్ రికన్‌స్ట్రక్షన్ ఆపరేషన్ చేయనున్నారు.
![]() |
![]() |