![]() |
![]() |

'ప్రేమనగర్', 'ప్రేమాభిషేకం'.. ఇలా 'ప్రేమ'ని టైటిల్ లో చేర్చుకున్న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో చాలామటుకు విజయం సాధించాయి. వాటిలో 'ప్రేమ కానుక' కూడా ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామాలో ఏయన్నార్ కి జంటగా శ్రీదేవి, మధుమాలిని అలరించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సోలో హీరోగా అక్కినేని నటించిన చిత్రం ఇదొక్కటే కావడం విశేషం.
రావుగోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి, నర్రా వెంకటేశ్వరరావు, చలపతిరావు మనోరమ, సుభాషిణి, పుష్పలత, మాస్టర్ హరీశ్ తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
చక్రవర్తి బాణీలకు ఆచార్య ఆత్రేయ సాహిత్యమందించారు. పాటల్లో "అయ్యారే తుంటరోడా", "చెమ్మా చెక్కా", "మనసుల ముడి", "ఈ కొండ కోనల్లో", "జంతర్ మంతర్", "వంట చేసి చూపిస్తా".. ఇలా అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మించిన 'ప్రేమకానుక'.. 1981 జూన్ 27న విడుదలైంది. నేటితో ఈ చిత్రం 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |