![]() |
![]() |

తమ అభిమాన హీరోను కలవాలని ఫ్యాన్స్ ఆశ పడుతుంటారు. హీరోని కలవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆయనను కలవడం కోసం ఏకంగా 231 కిలోమీటర్ల దూరం నడిచి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి అభిమానానికి చరణ్ ఫిదా అయిపోయాడు.
తమ అభిమాన హీరో చరణ్ ను కలిసేందుకు తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ముగ్గురు యువకులు హైదరాబాద్ వరకు నడిచారు. సంధ్య జయరాజ్, రవి, వీరేష్ అనే ముగ్గురు యువకులు చరణ్ ని కలిసే ఉద్దేశంతో జూన్ 20వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 231 కిలోమీటర్లు నడిచి.. నాలుగు రోజుల అనంతరం హైదరాబాద్ చేరుకుని చరణ్ ను కలిశారు.
జూన్ 24వ తేదీకి హైదరాబాద్ చేరుకున్న ముగ్గురు యువకులు.. మొదట చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు చేరుకున్నారు. అయితే వీరు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన విషయాన్ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది చరణ్ దృష్టికి తీసుకువెళ్లగా.. వారి అభిమానానికి పొంగిపోయిన చరణ్.. వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడమే కాకుండా, వారితో ఒక గంట పాటు ముచ్చటించారు. అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
![]() |
![]() |