![]() |
![]() |

సమంత నెగటివ్ రోల్ చేసిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ ఓటీటీలో బ్లాక్‌బస్టర్ హిట్టయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఓటీటీ షోస్‌లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. టైటిల్ రోల్‌ను మనోజ్ బాజ్‌పేయి చేసిన ఈ సిరీస్‌ను రాజ్ అండ్ డీకే రూపొందించారు. కాగా ఈ షోలో సమంత పక్కనే ఉండే సాజిద్ అనే టెర్రరిస్ట్ క్యారెక్టర్‌ను షాహబ్ అలీ పోషించాడు. అతని నటనకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇందులో సమంత చేసిన రాజీ పాత్రపై ఇష్టం పెంచుకునే వ్యక్తిగా అతను కనిపించాడు.
కాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిజానికి తమ ఇద్దరి పాత్రల మధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని చెప్పాడు. అంతే కాదు, తమ మధ్య కొన్ని ఇంటిమేట్, సజెస్టివ్ సీన్స్ కూడా కొన్ని ఉన్నాయనీ, అయితే వాటిని ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తిరించేశారనీ వెల్లడించి ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఇద్దరివీ ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడే పాత్రలు, తమకు అప్పగించిన పనిపైనే పూర్తిగా దృష్టిపెట్టే పాత్రలుగా తీర్చిదిద్దినప్పటికీ, ఇద్దరి మధ్యా ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉన్నట్లుగా రాజీ, సాజిద్ క్యారెక్టర్లను మలిచారు డైరెక్టర్లు.
"ఇది ఇంటిమేట్ సీన్లు మాత్రమే తీసేయడం లాంటిది కాదు. ఇది సుదీర్ఘమైన సిరీస్. ఆ తర్వాత ఎడిటింగ్ అనే ప్రక్రియ వస్తుంది. ఇది ఒక పర్టిక్యులర్ సీన్‌ను ఎడిట్ చేయడం లాంటిది కాదు. అవసరమైన, లాజికల్ సీన్లను మాత్రమే ఉంచారనుకుంటున్నాను. లాజికల్‌గా అనిపించని సీన్లను ఫైనల్ వెర్షన్‌లో పక్కన పెట్టేశారు." అని చెప్పాడు షాహబ్ అలీ.
"షో చివరకు వచ్చేసరికి మా ఇద్దరి పాత్రలు ప్రేమలో పడినట్లుగా చూపించే కొన్ని సీన్లను చేశాం. కానీ ఆ సీన్లు సరైనవి కావని క్రియేటర్స్ అనుకొని ఉండాలి. అందుకే, వాటిని ఎడిటింగ్‌లో తీసేశారు. అవే కాదు, అనేక సీన్లను తీసేశారు. కాబట్టి అదేమీ పెద్ద విషయం కాదు. అదొక ప్రక్రియ." అని అతను తెలిపాడు.
![]() |
![]() |