![]() |
![]() |

తెలుగు, తమిళ, హిందీ.. ఇలా విభిన్న భాషల్లో కథానాయికగా తనదైన ముద్రవేసింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇదిలా ఉంటే.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఓటీటీ వేదికల్లోనూ సందడి చేస్తోంది మిస్ భాటియా. ఇప్పటికే రెండు వెబ్ - సిరీస్ ల్లో నటించిన తమన్నా.. తాజాగా మరో సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. `యారీ దోస్తీ` పేరుతో తెరకెక్కనున్న ఈ సిరీస్ లో తమన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న లవర్ రోల్ లో దర్శనమివ్వనుందట. సెప్టెంబర్ లో పట్టాలెక్కనున్న ఈ సిరీస్.. 2022లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుందని బజ్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తమన్నా ఒప్పుకుంటున్న సిరీస్ లన్నీ విభిన్న భాషల్లో విభిన్న ఓటీటీ వేదికల్లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఆమె నటించిన తొలి సిరీస్ `లెవెన్త్ అవర్` సంగతే తీసుకుంటే.. తెలుగు భాషలో రూపొంది `ఆహా`లో స్ట్రీమ్ అయింది. ఇక రెండో సిరీస్ `నవంబర్ స్టోరీ` ముచ్చటే తీసుకుంటే.. ప్రధానంగా తమిళంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ `డిస్నీ ప్లస్ హాట్ స్టార్`లో స్ట్రీమ్ అయింది. కట్ చేస్తే.. ఇప్పుడు మూడో సిరీస్ హిందీలో రూపొందనుంది. అలాగే మరో ఓటీటీ వేదిక `అమెజాన్ ప్రైమ్`లో స్ట్రీమ్ కాబోతోంది.
మొత్తమ్మీద.. `డిఫరెంట్ లాంగ్వేజెస్ - డిఫరెంట్ ఓటీటీస్` అన్నట్లుగా తమన్నా `వెబ్ - సిరీస్` స్ట్రాటజీ సాగుతోందన్నమాట.
![]() |
![]() |