![]() |
![]() |

హిందీనాట ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది తాప్సీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో `రష్మీ రాకెట్`, `లూప్ లపేటా`, `దోబారా`, `శభాష్ మిథు` వంటి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే తమిళంలో `అన్నాబెల్లి సుబ్రమణియమ్` అనే సినిమా కూడా చేస్తోంది తాప్సీ. కాగా, తాప్సీ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఆ వివరాల్లోకి వెళితే.. `K-13` చిత్రంతో కోలీవుడ్ లో దర్శకుడిగా తొలి అడుగు వేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న భరత్ నీలకంఠన్.. ఇటీవల తాప్సీకి ఓ కథ వినిపించాడట. `ఏలియన్స్` చుట్టూ అల్లుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో తాప్సీదే ప్రధాన పాత్ర అట. కాన్సెప్ట్, రోల్ నచ్చడంతో తాప్సీ ఈ భారీ బడ్జెట్ మూవీకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అంతేకాదు.. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ తమిళ చిత్రం.. వచ్చే సంవత్సరం థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి.. తాప్సీ చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం ఆమెకి ఎలాంటి గుర్తింపు తీసుకువస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. తాప్సీ ముఖ్య పాత్రలో నటించిన హిందీ చిత్రం `హసీన్ దిల్ రుబా` జూలై 2న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
![]() |
![]() |