![]() |
![]() |

2021 పొంగల్ బ్లాక్ బస్టర్ `మాస్టర్` చిత్రంలో కోలీవుడ్ స్టార్ విజయ్ కి జోడీగా కనువిందు చేసింది మాళవికా మోహనన్. త్వరలో ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ కెప్టెన్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేయనున్న విషయం విదితమే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన.. విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న రానుందట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విజయ్ కి జంటగా కీర్తి సురేశ్ నటించబోతోందని ఆ మధ్య ప్రచారం సాగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మాళవిక కనిపించనుందట. మరి.. ఈ కథనాల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. ఇందులో అతనికి జతగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటిస్తోంది.
![]() |
![]() |