![]() |
![]() |

`ఖైదీ`, `మాస్టర్` చిత్రాలతో తమిళ, తెలుగు భాషల్లో దర్శకుడిగా ఎనలేని గుర్తింపుని తెచ్చుకున్నారు లోకేశ్ కనకరాజ్. ప్రస్తుతం ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్.. లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో `విక్రమ్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కమల్ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. `విక్రమ్` తరువాత లోకేశ్ చేయబోయే ప్రాజెక్ట్స్ పై రకరకాల కథనాలు వస్తున్నాయి. మరీముఖ్యంగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో లోకేశ్ ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రచారం సాగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ వెంచర్ ని నిర్మించనుందట. అంతేకాదు.. ఇదో పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కనుందని అంటున్నారు. త్వరలోనే చరణ్ - లోకేశ్ కాంబో మూవీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. `రంగస్థలం` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత చరణ్, మైత్రి కాంబోలో రానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా, చరణ్ ప్రస్తుతం `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఆపై ఏస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయాల్సి ఉంది.
![]() |
![]() |