![]() |
![]() |

ఈ ఏడాది సంక్రాంతికి సెన్సేషన్ క్రియేట్ చేసిన `క్రాక్` చిత్రంలో లేడీ విలన్ జయమ్మగా అదరగొట్టింది వరలక్ష్మీ శరత్ కుమార్. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ పాత్రని మలిచిన విధానం, ఆ పాత్రలో వరలక్ష్మి ఒదిగిపోయిన తీరు మాస్ ఆడియన్స్ జేజేలు అందుకుంది. ఈ నేపథ్యంలోనే.. వరలక్ష్మి కోసం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మరో పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేశారట గోపీచంద్.
ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ వెంచర్.. కోవిడ్ పరిస్థితులు చక్కదిద్దుకున్నాక సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, `క్రాక్` తరహాలో ఇందులోనూ లేడీ విలన్ రోల్ ఉందట. ఆ క్యారెక్టర్ లో వరలక్ష్మిని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట గోపీచంద్. త్వరలోనే `#NBK 107`లో వరలక్ష్మి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. మాస్ మహారాజా రవితేజకి అచ్చొచ్చిన వరలక్ష్మి విలనిజం.. బాలయ్యకు కూడా కలిసొస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరలక్ష్మి చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాలు రూపొందుతున్నాయి.
![]() |
![]() |