![]() |
![]() |

హైదరాబాద్ టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' జాబితాని ప్రకటించింది. సినిమా, స్పోర్ట్ పర్సనాలిటీస్ ప్లేస్ దక్కించుకున్న ఈ జాబితాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ టాప్ లో ఉన్నాడు. విజయ్ వరుసగా మూడోసారి ఫస్ట్ ప్లేస్ ని సొంతం చేసుకోవడం విశేషం. యూత్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ రౌడీ హీరో.. ఆన్ స్క్రీన్ లోను, ఆఫ్ స్క్రీన్ లోను తన ఆటిట్యూడ్ తో రోజురోజుకి క్రేజ్ పెంచుకుంటున్నాడు. బాలీవుడ్ స్టార్స్ సైతం విజయ్ స్టైల్ కి ఫిదా అయిపోతున్నారు. ఎందరో హీరోయిన్స్ రౌడీకి ఫ్యాన్స్ గా మారిపోయారు. ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా విజయ్ తక్కువ టైంలోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తాజాగా వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మెన్ గా నిలిచి రికార్డు సృష్టించాడు.
ఇక 'మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' లిస్ట్ లో విజయ్ తరువాతి స్థానాలు రామ్ పోతినేని, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగశౌర్య దక్కించుకున్నారు. గత ఏడాది రెండో స్థానంలో ఉన్న చరణ్.. ఈసారి నాలుగో స్థానానికి పడిపోయాడు. 2019 లో మూడో స్థానంలో ఉన్న రామ్ రెండో ప్లేస్ కి వచ్చాడు. గత ఏడాది 19వ స్థానంలో ఉన్న తారక్.. ఇప్పుడు టాప్ 3 లోకి వచ్చాడు. ఇక యంగ్ హీరో ఈ లిస్టులో నాగశౌర్య 5వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న నాగశౌర్య.. తన సిక్స్ ప్యాక్ బాడీతో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు.
![]() |
![]() |