![]() |
![]() |

ఓ చిన్నారిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఆ చిన్నారి తను దాచుకున్న డబ్బులతో పాటు, తన పుట్టినరోజు వేడుకలకు అయ్యే ఖర్చును చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఆ డబ్బును ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు కోసం వినియోగించాలని కోరింది. దీంతో ఆ చిన్నారి పెద్ద మనసుకు ఫిదా అయిన చిరంజీవి.. చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో క్లిప్ విడుదల చేశారు.
"పి.శ్రీనివాస్, హనీ దంపతుల కుమార్తె పేరు అన్షీ. జూన్ 1న తన బర్త్ డే. తాను దాచుకున్న డబ్బులతో పాటు తన పుట్టినరోజు వేడుకలకు అయ్యే ఖర్చును కూడా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ కోసం ఇచ్చేసింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం అవుతుందని ఆ చిన్నారి చెబుతోంది. ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు నేను ముగ్దుడిని అయిపోయాను. వండర్ ఫుల్ కిడ్. గాడ్ బ్లెస్ యూ అన్షీ. హ్యాపీ బర్త్ డే.” అంటూ వీడియోలో చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపించారు చిరు.
కాగా, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
![]() |
![]() |