![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టిస్టారర్ మూవీ `ఆచార్య`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామాలో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జంటగా పూజా హెగ్డే దర్శనమివ్వనున్నారు. `రియల్ హీరో` సోనూ సూద్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సీనియర్ హీరోయిన్ సంగీత, రెజీనా ప్రత్యేక గీతాల్లో సందడి చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. `ఆచార్య` చిత్రానికి సంబంధించి సింహభాగం చిత్రీకరణ పూర్తయ్యింది. కేవలం 20 రోజుల షూటింగ్ పార్ట్ మాత్రమే పెండింగ్ ఉందట. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా చిత్రీకరణకి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. కాగా, జూలై నుంచి కోకాపేటలో వేసిన ప్రత్యేక సెట్ లో `ఆచార్య` షూటింగ్ పునఃప్రారంభం కానుందట. నిరవధికంగా సాగే ఈ షెడ్యూల్ లో చిరంజీవి - రామ్ చరణ్ - సోనూ సూద్ పాల్గొంటారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, `ఆచార్య`ని విజయదశమి కానుకగా విడుదల చేయడానికి కొరటాల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందట. మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
![]() |
![]() |