![]() |
![]() |

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన పలు చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. అంతేకాదు.. చాలా కాలంగా విడుదలకు నోచుకోని సినిమాలకు కూడా ఓటీటీ వరంగా మారింది. ఈ క్రమంలోనే.. దాదాపు మూడున్నరేళ్ళ క్రితమే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఓ క్రేజీ కోలీవుడ్ ప్రాజెక్ట్ ఓటీటీలో సందడి చేయనుంది. ఆ సినిమానే.. `నరగాసురన్`.
అరవింద్ స్వామి, శ్రియా శరణ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని `ధ్రువంగళ్ పదినారు` (తెలుగులో `16` పేరుతో అనువాదమైంది) వంటి సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ ని రూపొందించిన యువ దర్శకుడు కార్తిక్ నరేన్ తెరకెక్కించారు. సినిమాని శరవేగంగా చిత్రీకరించినప్పటికీ.. పలు కారణాల వల్ల సకాలంలో థియేటర్స్ లో విడుదల చేయలేకపోయారు. ఎట్టకేలకు ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ బాట పడుతోందని కోలీవుడ్ బజ్. త్వరలోనే సోనీ లైవ్ ఓటీటీలో `నరగాసురన్` స్ట్రీమ్ కాబోతోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
తెలుగులో ఈ సినిమాని `నరకాసురుడు` పేరుతో అనువదించబోతున్నట్లు అప్పట్లో ప్రకటించారు. మరి.. తెలుగులోనూ ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అందుబాటులోకి వస్తుందేమో చూడాలి.
![]() |
![]() |