![]() |
![]() |

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరించే నందమూరి కళ్యాణ్ రామ్ మరో ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధమయ్యారు. నేడు తన తాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా తాను చేస్తున్న భారీ ప్రాజెక్ట్ 'NKR18' కు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు 'బింబిసార' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేసినట్లు వెల్లడించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 'బింబిసార' టైటిల్ రివీల్ చేస్తూ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో కింగ్ గెటప్ లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో కళ్యాణ్ రామ్ కనువిందు చేస్తున్నారు. యుద్ధ రంగంలో శత్రు సైనికులను చంపి వారి శవాలపై ఠీవిగా కూర్చున్న కళ్యాణ్ రామ్ లుక్ టెరిఫిక్ గా ఉంది.
కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘బింబిసార’ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
![]() |
![]() |