![]() |
![]() |

గంగవ్వతో 'మై విలేజ్ షో' చేసే అనిల్ జీల మే 1వ తేదీన టీచరమ్మ ఆమని మెడలో మూడు ముళ్లు వేసి, తన భార్యగా చేసుకున్నాడు. ఆ పెళ్లిని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చూపించాడు. అతను వెరైటీగా కొట్టించిన పెళ్లి శుభలేఖ కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. అప్పట్నుంచీ ఇటు అనిల్, అటు ఆమని తమ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఇద్దరి యాక్టివిటీస్‌ను, తాము కలిసున్న ఫొటోలను షేర్ చేసుకుంటూ ఆకట్టుకుంటూ వస్తున్నారు.
ఆమనితో తన సంసారం ఎట్లా సాగుతున్నదో తెలియజేస్తూ లంబాడిపల్లిలో కొత్త సంసారం అంటూ ఇటీవల ఓ వీడియో తీసి తన అనిల్ జీల వ్లాగ్స్‌లో పోస్ట్ చేశాడు. దానిని మస్తు మంది చూశారు. ఐదు రోజుల్లో దానికి 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయ్. రెండు రోజుల క్రితం అతను పోస్ట్ చేసిన మరో వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అవుతోంది. "పెండ్లైన 20రోజులకు మొకాళ్ళ చిప్పలు ఇరుగుతయ్" అంటూ పేరుపెట్టి, ఇంట్లో సింక్ దగ్గర అంట్లు తోమడానికి తనను ఆమని ఎలా దబాయిస్తుందో ఆ 26 సెకన్ల వీడియోలో చూపించాడు. ముందు ఆమని బాల్కనీలో లాప్‌టాప్ చూసుకుంటున్న అనిల్‌ను చూసి, ఆ అంట్లు తోమమని గోముగా సైగ చేస్తుంది. అనిల్ రానన్నట్లు ముఖం పెడతాడు. దాంతో మోకాలి చిప్పలు ఇరగ్గొడ్తా చెప్తున్నా అని కోపంగా వార్నింగ్ ఇస్తుంది ఆమని. షాకై సింక్ దగ్గరకు వెళ్తాడు అనిల్. అతడి ప్లేస్‌లో లాప్‌టాప్ పట్టుకొని కూర్చొని పగలబడి నవ్వుతుంది ఆమని.

అయితే ఆ వీడియో తాలూకు బిహైండ్ ద సీన్స్‌ను ఆమని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా బయటపెట్టేసింది. "యాక్టింగ్ ఇలా నేర్పిస్తున్నాడు" అని క్యాప్షన్ పెట్టి ఓ వీడియోను షేర్ చేసింది. అందులో మోకాలి చిప్పలు ఇరగ్గొడ్తా చెప్తున్నా అనే డైలాగ్ చెప్పడానికి మూడు టేకులు తీసుకుంది ఆమని. ఆ వీడియో తియ్యడానికి ఆమనిని అనిల్ బాగా ఇబ్బంది పెట్టేశాడని ఆమె ఫేస్ ఫీలింగ్స్ చెప్పేస్తున్నాయ్. అయితే అది ఇష్టంతో కూడుకున్న ఇబ్బందేనని మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి అనిల్‌కు తగ్గ పెళ్లాం దొరికిందని కామెంట్లు చేస్తున్నారు వారి ఫాలోయర్స్. ఆమని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కు కూడా దాదాపు 39 వేల మంది ఫాలోయర్స్ ఉండటం విశేషమే.
![]() |
![]() |