![]() |
![]() |

కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ఓటీటీ వేదికలు పోటాపోటీగా సిరీస్ లు, సినిమాలు రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నాయి. ఓటీటీ వేదికల డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో.. ఓటీటీలో విచ్చలవిడిగా ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో ప్రజల ముందుకు వస్తోంది. సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇప్పటివరకు ప్రైవేట్ సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్న ఓటీటీ తరహా మాధ్యమాన్ని కేరళ ప్రభుత్వమే త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ ఓ టీవీ ఛానల్లో వెల్లడించారు. అలాగే టీవీ ప్రోగ్రామ్స్, సీరియళ్లను సెన్సార్ పరిధిలోకి తీసుకురానున్నామని తెలిపారు.
కరోనా ప్రభావంతో మలయాళ చిత్రపరిశ్రమ నష్టాల్లో ఉందని, దీనిని చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నామని సాజీ చెరియన్ అన్నారు. నిర్మాతలే కాకుండా కళాకారులందరూ ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. వారందరికీ సహాయపడేలా ఓ కొత్త ప్రాజెక్టును అమల్లోకి తీసుకొస్తామని సాజీ చెరియన్ స్పష్టం చేశారు.
![]() |
![]() |