![]() |
![]() |

సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో తమ లక్ ని టెస్ట్ చేసుకోవడం చూస్తుంటాం. అయితే సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరైన సమంత మాత్రం ఇంతవరకు బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే భయం వల్లనే ఇంతకాలం బాలీవుడ్ లో నటించలేదని తాజాగా సమంత చెప్పుకొచ్చింది.
రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో సమంత బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ర్టీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ గురించి ఇటీవల మీడియాతో మాట్లాడిన సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో హిందీ సినిమాలు ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నకు.. "భయం వల్లనే చేయలేదు .. అక్కడ నెగ్గుకు రావాలంటే మరింత ప్రతిభ అవసరం అనిపించింది" అని సమంత చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో ఏ హీరోతో నటించాలనుందనే ప్రశ్నకు రణ్‌బీర్ కపూర్ అని సమాధానం చెప్పింది.
కాగా, పెళ్లి తరువాత సమంత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది. నటన ప్రధానమైన పాత్రలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం సమంత 'శాకుంతలం' చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది.
![]() |
![]() |