![]() |
![]() |
.jpg)
తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్పుడప్పుడు ఒకరి సినిమాలో ఒకరు మెరిసి సందడి చేస్తుంటారు. చరణ్ నటించిన 'మగధీర', 'బ్లూస్ లీ' సినిమాలలో చిరంజీవి క్యామియో రోల్స్ చేయగా.. చిరు 'ఖైదీ నెంబర్ 150'లో చరణ్ ఒక సాంగ్ లో మెరిశాడు. ఇప్పుడు వీరిద్దరూ వెండితెర మీద అసలైన సందడి చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర దాదాపు నలభై నిమిషాల నిడివితో ఉంటుందని సమాచారం.
'ఆచార్య' చిత్రంలో చరణ్ పాత్ర గురించి తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర చనిపోతుందని ప్రచారం జరుగుతోంది. చరణ్ పాత్ర ద్వితీయార్ధంలో వస్తుందని, కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని, ఆ పాత్ర తాలూకు కథను చిరంజీవి పూర్తి చేస్తాడని కొరటాల తాజాగా చెప్పారు. కొరటాల మాటల్ని బట్టి చూస్తే.. చరణ్ పాత్ర చనిపోతుందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక కాజ్ కోసం చరణ్ పాత్ర విలన్లతో పోరాడి, వాళ్ల చేతిలో చనిపోతే.. ఆ తర్వాత చిరు పాత్ర దాన్ని పూర్తి చేస్తుందని తెలుస్తోంది.
![]() |
![]() |