![]() |
![]() |

'ఘాజీ' ఫేమ్ విక్రమ్‌జిత్ కన్వర్‌పాల్ కొవిడ్-19 సమస్యలతో బాధపడుతూ శనివారం మృతి చెందారు ఆయన వయసు 52 సంవత్సరాలు. ముంబైలో చికిత్స నిమిత్తం సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో చేరిన విక్రమ్‌జిత్ అక్కడే చివరి శ్వాస విడిచారు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయిన పలు సినిమాల్లో, టెలివిజన్ సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ వచ్చారు. చివరిసారిగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోన్న స్పెషల్ ఆప్స్ వెబ్ సిరీస్‌లో కనిపించారు. గత ఏడాది యూట్యూబ్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో అందరినీ ఇళ్లల్లో క్షేమంగా ఉండమంటూ విజ్ఞప్తి చేశారు. కొవిడ్ కారణంగా తన ఫ్యామిలీని మిస్సవుతున్నానని ఆ వీడియోలో చెప్పిన ఆయన, త్వరలోనే వారిని కలుసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
కార్పొరేట్, పేజ్ 3, ఆరక్షణ్, జబ్ తక్ హై జాన్, రాకెట్ సింగ్, మర్డర్ 2, 2 స్టేట్స్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించారు. రానా హీరోగా సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'ఘాజీ' మూవీలో పాకిస్తాన్ నేవీ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌కు ముందు విడుదలైన 'మద' అనే థ్రిల్లర్‌లో బాలసుబ్రమణ్యం అనే క్యారెక్టర్‌లో కనిపించారు.
విక్రమ్‌జిత్ ఆకస్మిక మృతిపై పలువురు సెలబ్రిటీలు దిగ్భ్రాంతినీ, సంతాపాన్నీ వ్యక్తం చేశారు. మనోజ్ బాజ్‌పేయి, నీల్ నితిన్ ముఖేశ్, విక్రమ్ భట్ తదితరులు సోషల్ మీడియా ద్వారా విక్రమ్‌జిత్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు నివాళులర్పించారు.
![]() |
![]() |