![]() |
![]() |

చరిత్ర పురుషులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ స్నేహం, పోరాటం చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కుతున్న పిరియడ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`. పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొమురంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తీర్చిదిద్దుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే.. వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో తయారవుతున్న `ఆర్ ఆర్ ఆర్`లో ప్రతీ సన్నివేశం కనువిందుగా ఉంటుందని టాక్. అయితే, సినిమాలో ఎన్నో హైలైట్స్ ఉన్నా.. ఒకే ఒక సీన్ ఆ హైలైట్స్ కే హైలైట్ గా ఉంటుందని బజ్. ఇంతకీ ఆ సన్నివేశం ఏంటంటే.. కారాగారంలో సీతారామరాజు, కొమురం భీమ్ మధ్య సాగే హెవీ ఎమోషనల్ సీన్ అట. ఇందులో చరణ్, తారక్ నటన ప్రతి ఒక్కర్నీ కదిలించేలా ఉంటుందని వినికిడి.
మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే సినిమా విడుదల తేది వరకు వేచిచూడాల్సిందే. విజయదశమి కానుకగా అక్టోబర్ 13న `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా 2022 సంక్రాంతి లేదా వేసవికి ఈ భారీ మల్టిస్టారర్ వాయిదా పడే అవకాశముందంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |