![]() |
![]() |

`ఓ మై ఫ్రెండ్` (సిద్ధార్థ్), `ఎంసీఏ` (నాని).. ఇలా తన తొలి రెండు సినిమాలను మీడియం రేంజ్ హీరోలతోనే చేశాడు టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్. అయితే, మూడో సినిమాని మాత్రం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో `వకీల్ సాబ్`గా తీసి వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ కోర్ట్ డ్రామా `పింక్`కి రీమేక్ అయినప్పటికీ తన మాటలు, మార్పులతో `వకీల్ సాబ్`ని పవన్ ఇమేజ్ కి తగ్గట్టు మలిచి.. పవన్ మన్ననలు పొందాడు వేణు. అలాగే, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.
కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ ని కూడా పవన్ తోనే చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట వేణు శ్రీరామ్. అంతేకాదు.. పవన్ కోసం ఇప్పట్నుంచే ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. పవన్ ఇమేజ్ కి తగ్గట్టు తయారు చేసుకుంటున్న ఈ స్క్రిప్ట్ ని.. త్వరలోనే తనకి వినిపించబోతున్నాడట. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తన తొలి మూడు చిత్రాలను నిర్మించిన `దిల్` రాజునే ఈ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశముందని టాక్. ఒకవేళ ఈ కథ సెట్ కాకుంటే.. `దిల్` రాజు లిస్ట్ లో వంశీ పైడిపల్లితో పాటు మరో దర్శకుడు కూడా పవన్ కోసం క్యూలో ఉన్నారని.. కథలు సిద్ధం చేస్తున్నారని బజ్.
కాగా, పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు చిత్రాలున్నాయి. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్, `హరిహర వీరమల్లు` చిత్రీకరణ దశలో ఉండగా.. హరీశ్ శంకర్ కాంబినేషన్ మూవీ, సురేందర్ రెడ్డి డైరెక్టోరియల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నాయి. వాటి తరువాతే `దిల్` రాజు సినిమా ఉంటుందని బజ్. మరి.. ఆ అవకాశం ఈ సారి ఒరిజినల్ స్టోరీ సిద్ధం చేస్తున్న వేణు శ్రీరామ్ కి దక్కుతుందో లేదంటే మరొకరికి లభిస్తుందో చూడాలి.
![]() |
![]() |