![]() |
![]() |
.jpg)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 9న విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించగా విజయం సాధించిన బాలీవుడ్ ఫిల్మ్ 'పింక్'కు రీమేక్ అయిన వకీల్ సాబ్‌లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌పామ్‌పై విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈనెల 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ కానున్నది.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది. ఈ సందర్భంగా 'వకీల్ సాబ్' సరికొత్త ట్రైలర్‌ను అది రిలీజ్ చేసింది. దాన్ని షేర్ చేస్తూ, "In the hall of justice, he will turn black to white. New trailer out now! Meet #VakeelSaabOnPrime on April 30." అని ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది.
వకీల్ సాబ్ సత్యదేవ్‌గా పవన్ కల్యాణ్ ప్రదర్శించిన నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆయన కెరీర్‌లోని బెస్ట్ క్యారెక్టర్ ఇదేనని చాలామంది ప్రశంసించారు. 'వకీల్ సాబ్' త్వరలో ఓటీటీలోకి రాబోతున్నదంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలోకి వచ్చింది. అయితే అలాంటిదేమీ లేదని నిర్మాత దిల్ రాజు చెబుతూ వచ్చారు.
.jpg)
అయితే ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ కారణంగా ఫస్ట్ షో, సెకండ్ షో వేయలేని పరిస్థితుల్లో థియేటర్లు మూతపడుతుండటంతో చివరకు ఓటీటీలో రిలీజ్ చేయడానికి దిల్ రాజు ముందుకు వచ్చారు. మంచి ఆఫర్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఎలా అయితే ఆడియెన్స్ ఆదరించారో, అంతకు మించి ఓటీటీలో వకీల్ సాబ్‌కు వీక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నారు.
![]() |
![]() |