![]() |
![]() |

అందాల తార సమంత కథానాయికగా ఎంట్రీ ఇచ్చి పదేళ్ళు దాటింది. ఈ దశాబ్దకాలంలో నటిగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో అలరించింది సామ్. తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్ళయ్యాక కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సామ్.. త్వరలో ఓ వెబ్ సిరీస్ తో సందడి చేయనున్న సంగతి తెలిసిందే.
పాపులర్ వెబ్ సిరీస్ `ద ఫ్యామిలీ మ్యాన్`కి కొనసాగింపుగా తెరకెక్కిన `ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2`తో సామ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందులో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనుంది సమంత. అంతేకాదు.. తన విలనిజంతో భయపెట్టనుంది. వాస్తవానికి ఫిబ్రవరి 12నే అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమ్ కావాల్సింది. అయితే కొన్ని కారణాల వాయిదా పడింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మే నెలలో `ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` స్ట్రీమ్ కానుందట. మరి.. డెబ్యూ సిరీస్ తో సామ్ నటిగా ఎలాంటి గుర్తింపుని పొందుతుందో చూడాలి.
`ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2`లో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
samantha web serieses going to release in may,The Family Man release in may,The Family Man Season 2 Release Date Update,The Family Man season 2,samantha The Family Man season 2
![]() |
![]() |