![]() |
![]() |

బాలీవుడ్ దివా దీపికా పదుకొణే.. ఎట్టకేలకు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో.. అందునా ఓ పాన్ వరల్డ్ సినిమాతో. ఈ ప్రకటన వచ్చి ఏడాది దాటింది. అయితే, ఇంతవరకు ఈ సినిమా ప్రారంభం కాలేదు. ఇంకా చెప్పాలంటే.. ఇప్పట్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళేలా లేదు. ఈ సినిమా తరువాత ప్రభాస్ కమిట్ అయిన `సలార్`, `ఆదిపురుష్` చకచకా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.`మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో దిగ్గజ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ చిత్రం మాత్రం.. వాయిదా పడుతూ వస్తోంది. నిన్న మొన్నటివరకు జూన్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని వినిపించింది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కడానికి మరింత సమయం పడుతుందట. అంతేకాదు.. దీపిక కూడా అక్టోబర్ తరువాతే కాల్షీట్స్ ఎడ్జస్ట్ చేయగలనని చెప్పిందట. ఈలోపు తన చేతిలో ఉన్న బాలీవుడ్ ప్రాజెక్ట్ `పఠాన్`ని పూర్తిచేస్తానని మాటిచ్చిందట. మొత్తమ్మీద.. ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబో మూవీ ఏవేవో కారణాల వల్ల.. సెట్స్ పైకి వెళ్ళే విషయంలోనే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వార్తల్లో నిలుస్తోంది.
![]() |
![]() |