![]() |
![]() |

కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో పలు బ్లాక్ బస్టర్స్ రూపొందాయి. వాటిలో `ఘరానా బుల్లోడు` ఒకటి. `అన్నమయ్య` కంటే ముందు వచ్చిన ఈ సినిమానే.. నాగ్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి సోషల్ మూవీ కావడం విశేషం. నాగార్జునకి జంటగా రమ్యకృష్ణ, ఆమని నటించిన ఈ సినిమాలో జయచిత్ర, మురళీమోహన్, సుధ, జయంతి, శ్రీహరి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, తనికెళ్ళ భరణి, ఏవీయస్, సుధాకర్, మహేశ్ ఆనంద్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరవాణి కీరవాణి బాణీలతో రూపొందిన ఈ మాస్ ఎంటర్ టైనర్ లోని పాటలన్నీ జనాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. ``భీమవరం బుల్లోడా`` పాట అప్పట్లో ఓ సంచలనం. అలాగే ``సై సై సయ్యారే``, ``అదిరిందిరో``, ``చుక్కల్లో తళుకులా``, ``ఏం కసి ఏం కసి``, ``వంగి వంగి`` గీతాలు కూడా మాస్ ని ఊర్రూతలూగించాయి. ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణ మోహనరావు నిర్మించిన `ఘరానా బుల్లోడు` 1995 ఏప్రిల్ 27న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో 26 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |