![]() |
![]() |

కొవిడ్ సెకండ్ వేవ్ దెబ్బకు వారూ వీరూ అని లేకుండా అన్ని వర్గాల వారూ, అన్ని వయసుల వారూ ప్రభావితమవుతున్నారు. సౌత్ నుంచి నార్త్ దాకా ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు కొవిడ్ బారిన పడగా, లేటెస్ట్‌గా ఆ లిస్ట్‌లో సౌత్ ఇండియన్ టాప్ యాక్ట్రెస్ పూజా హెగ్డే కూడా చేరింది. ఆమెకు ఆదివారం రాత్రి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది.
"అందరికీ తెలియజేయునది ఏమనగా, టెస్టులో నాకు కొవిడ్-19గా నిర్ధారణ అయ్యింది. అన్ని రకాల ప్రోటోకాల్స్ పాటిస్తూ మా ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి, క్వారంటైన్‌లోకి వెళ్లాను. ఇటీవల నాకు సన్నిహితంగా మెలగిన వారందరినీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ ప్రేమ, మద్దతుకు థాంక్స్. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. దయచేసి అందరూ ఇంట్లో క్షేమంగా ఉండండి." అని ఆమె రాసుకొచ్చింది.
.jpg)
ఆమె ఇన్‌స్టాలో తనకు కొవిడ్ సోకిందని వెల్లడించడం ఆలస్యం.. ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే తమన్నా, రకుల్ ప్రీత్, నివేదా థామస్ లాంటి హీరోయిన్లు కొవిడ్-19 బారినపడి కోలుకున్నారు.
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో 'రాధే శ్యామ్', 'ఆచార్య' సినిమాలతో పాటు హిందీలో 'సర్కస్', తమిళంలో విజయ్ సినిమా చేస్తోంది. ఇప్పటికే అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా పూర్తి చేసింది.
![]() |
![]() |