![]() |
![]() |
.jpg)
'ద గ్రేట్ ఇండియన్ కిచెన్'.. మలయాళ చిత్ర పరిశ్రమ అందించిన మరో ఆణిముత్యం. అనూహ్య పరిస్థితుల్లో వంటింటి కుందేలుగా మారిపోయి నిత్యం పలు ఇబ్బందులు పడుతున్న ఓ గృహిణి.. తన అభిప్రాయాలకు విలువ ఇవ్వని, సమస్యలను పట్టించుకోని భర్త నుంచి ఎలా విముక్తురాలయింది? అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ 100 నిమిషాల చిత్రం.. జనవరి 15న 'నీస్ట్రీమ్' ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అయింది. విమర్శకుల ప్రశంసలతో పాటు వీక్షకాదరణ కూడా పొందిన ఈ ఫ్యామిలీ డ్రామా.. తాజాగా 'అమెజాన్ ప్రైమ్'లోనూ స్ట్రీమ్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ చిత్రం తమిళంలో రీమేక్ అవుతోంది. వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలిచిన తెలుగింటి అమ్మాయి ఐశ్వర్యా రాజేశ్.. మాతృకలో నిమిష చేసిన భూమికను పోషిస్తోంది. ఇక ఒరిజినల్ లో సూరజ్ చేసిన భర్త పాత్రను నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ధరిస్తున్నాడు.
కణ్ణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మరి.. తనకు టైలర్ మేడ్ లాంటి ఈ రోల్ లో ఐశ్వర్యా రాజేశ్ ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
.jpg)
![]() |
![]() |