![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కేరళకుట్టి కీర్తి సురేశ్ ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'సర్కారు వారి పాట'. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఆ మధ్య దుబాయ్‌లో మహేశ్ బృందంపై చిత్రీకరించిన ఓ రిస్కీ ఫైట్ ఈ చిత్రం హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందట. అంతేకాదు.. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీ మొత్తాన్నే ఖర్చు చేశారని వినికిడి. మరి.. ఈ ఎపిసోడ్ సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.
కాగా, సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే స్పెషల్‌గా మోషన్ పోస్టర్‌ని - మహేశ్ పుట్టినరోజు కానుకగా టీజర్‌ని రిలీజ్ చేయాలని 'సర్కారు వారి పాట' యూనిట్ ప్లాన్ చేస్తోందట. 2022 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
![]() |
![]() |