![]() |
![]() |

ప్రస్తుత కాలంలో హీరోయిన్ వేషాలను పక్కన పెట్టి విలక్షణమైన పాత్రలు చెయ్యాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు.. రమ్యకృష్ణ. హీరోయిన్‌గా రాణిస్తున్న కాలంలోనే రజనీకాంత్ సినిమా నరసింహాలో నీలాంబరిగా నెగటివ్ రోల్ పోషించి, అదరహో అనిపించారామె. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కూడా తనలోని విలక్షణ నటిని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చూపిస్తూనే వస్తున్నారు. 'బాహుబలి'లో శివగామి రోల్ ఆమెకు ఎలాంటి పేరు తెచ్చిందో ప్రత్యేకించి చెప్పాలా!
తాజాగా సాయి తేజ్ హీరోగా, దేవా కట్టా డైరెక్ట్ చేస్తోన్న 'రిపబ్లిక్' మూవీలోనూ ఆమె మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ మూవీలో ఆమె "విశాఖ వాణి" అనే పవర్‌ఫుల్ పొలిటీషియన్ రోల్‌ను చేస్తున్నారు. ఆమె లుక్‌ను రిపబ్లిక్‌లో హీరోయిన్‌గా నటిస్తోన్న ఐశ్వర్యా రాజేశ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రివీల్ చేసింది. దాంతో పాటు, "Super happy to reveal the First Look of #VishakhaVani a.k.a Ramya Krishna garu from #Republic. “There is no right or wrong, only power is constant!” "తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం!” అంటూ రాసుకొచ్చింది.
ఆ లుక్‌లో రమ్యకృష్ణ ముఖం మాత్రమే కనిపిస్తోంది. పోర్ట్రెయిట్ స్కెచ్‌లాగా గీసిన ఆ లుక్‌లో ఆమె ఓ చైర్‌లో కూర్చున్నట్లు కనిపిస్తున్నారు. డార్క్ యెల్లో కలర్ శారీ, మెరూన్ కలర్ బ్లౌజ్ ధరించి ఉన్నారు. ఆమె కళ్లల్లో ఇంటెన్సిటీ తెలుస్తోంది. "తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం!” అని భావించే పొలిటీషియన్ అంటూ ఆ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చెప్తున్నారు కాబట్టి, ఆమెది నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌గా ఊహించవచ్చు.

జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్న 'రిపబ్లిక్' మూవీని జూన్ 4న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా, ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ఇతర ప్రధాన పాత్రధారులు.
![]() |
![]() |