![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రీవియస్ మూవీ `వి`తో పాతిక చిత్రాల మైలురాయికి చేరుకున్న ఈ యంగ్ హీరో.. ఈ నెలలోనే తన 26వ సినిమా `టక్ జగదీష్`తో పలకరించనున్నారు. `నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. ఏప్రిల్ 23న థియేటర్స్ లోకి రానుంది. ఇక `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో చేస్తున్న `శ్యామ్ సింగ రాయ్`.. దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. పిరియడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బెంగాలీ యువకుడిగా దర్శనమివ్వనున్నారు నాని.
కాగా, ఈ రెండు చిత్రాల తరువాత నాని అవుట్ అండ్ అవుట్ కామిక్ ఎంటర్ టైనర్ చేయబోతున్నారు. అదే.. `అంటే.. సుందరానికీ!`. `బ్రోచేవారెవరురా` ఫేమ్ వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. కేరళ కుట్టి నజ్రీయా నజీమ్ నాయికగా నటించనుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని మే నెలలో ప్రారంభించబోతున్నారని తెలిసింది. 2022 ఆరంభంలో ఈ సినిమా తెరపైకి వచ్చే అవకాశముంది. త్వరలోనే `అంటే.. సుందరానికీ!` సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |