![]() |
![]() |

తెలుగునాట అగ్ర కథానాయకుడిగా తనదైన ముద్రవేసిన కింగ్ నాగార్జున.. బాలీవుడ్ లోనూ నటుడిగా అలరించారు. `శివ` హిందీ వెర్షన్ `షివ`తో హిందీనాట తొలి అడుగేసిన నాగ్.. ఆపై `ఖుదాగవా`, `ద్రోహి`, `క్రిమినల్`, `మిస్టర్ బేచారా`, `అంగారే`, `జఖ్మ్`, `అగ్నివర్ష`, `ఎల్.ఒ.సి. కార్గిల్` చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలతో అక్కడివారిని ఆకట్టుకున్నారు.
కట్ చేస్తే.. దాదాపు పద్దెనిమిదేళ్ళ తరువాత బాలీవుడ్ మూవీలో దర్శనమివ్వనున్నారు నాగార్జున. ఆ సినిమానే.. `బ్రహ్మాస్త్ర`. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో `బిగ్ బి` అమితాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్, అలియా భట్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మూడు భాగాలుగా రాబోతోంది. కాగా, తాజాగా ఇందులో తన పాత్ర నిడివికి సంబంధించి వివరాలు తెలియజేశారు నాగ్. 30 నిమిషాలకి పైగా ఉండే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో తను కనిపించబోతున్నట్లు నాగ్ చెప్పుకొచ్చారు. మరి.. చాన్నాళ్ళ తరువాత నాగ్ చేస్తున్న ఈ హిందీ చిత్రం.. తనకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. నాగ్ తాజా చిత్రం `వైల్డ్ డాగ్` రేపు (ఏప్రిల్ 2) థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |