![]() |
![]() |

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. గురువారం ఆయనకు ఈ అవార్డుని అందిస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని సినిమా రంగంలో అత్యున్నత గుర్తింపుగా భావిస్తారు. 51 వ అవార్డును దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రదానం చేయబోతున్నారు.
రజనీకాంత్ సినిమా రంగానికి చేసిన అద్భుతమైన కృషికి గానూ ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది. ఆయన ఈ అవార్డుకు అర్హుడు కూడా కావడంతో రజనీ అభిమానులు ఈ వార్త విని సంబరాలు చేసుకుంటున్నారు. 45 సంవత్సరాల సినీ ప్రయాణంలో సూపర్‌స్టార్ రజినీ ఎన్నో మరపురాని విజయాల్ని అందించారు. ఓ హీరోగా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు పొందారు.
ఇదిలా వుంటే తమిళ నాట అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు జరుగుతున్నవేళ అది కూడా కేవలం ఐదు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న సమయంలో రజనీకి ప్రత్యేకంగా ఈ సందర్భంగాలో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించడం రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు. అంతే కాకుండా రజనీకాంత్ గత కొంత కాలంగా అధికార బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకి అవార్డుని కేంద్రం ప్రకటించడం రాజకీయ లబ్దికోసమేనని స్పష్టంగా తెలుస్తోందని కొంత మంది రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.
![]() |
![]() |