![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టిస్టారర్ మూవీ `ఆచార్య`. టైటిల్ రోల్ లో చిరు దర్శనమివ్వనుండగా.. తన పాత్రకి స్ఫూర్తిగా నిలిచే `సిద్ధ` క్యారెక్టర్ లో చరణ్ కనిపించనున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా `ఆచార్య` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సామాజిక సందేశంతో రూపొందుతున్నప్పటికీ.. అన్నీ వాణిజ్యాంశాలు ఈ సోషల్ డ్రామాలో ఉంటాయట. మరీ ముఖ్యంగా.. ఈ సినిమా ప్రథమార్ధంలో అదిరిపోయే కామెడీ ట్రాక్ ఉందట. చిరు, `వెన్నెల` కిశోర్ మధ్య వచ్చే ఈ ట్రాక్.. `ఆచార్య`కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
కాగా, `ఆచార్య`లో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ కి జంటగా పూజా హెగ్డే సందడి చేయనుంది. ఓ ప్రత్యేక గీతంలో రెజీనా తళుక్కున మెరవనుంది.
వేసవి కానుకగా మే 13న `ఆచార్య` ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
![]() |
![]() |