![]() |
![]() |
.jpg)
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుల్లో సాయితేజ్ ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. `రిపబ్లిక్` మూవీ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్టా రూపొందిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్.. జూన్ 4న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ సినిమా రిలీజయ్యేలోపే డెబ్యూ డైరెక్టర్ కార్తిక్ కాంబినేషన్ లో ఓ సినిమాని పట్టాలెక్కించనున్నాడు సాయితేజ్. ఇదో పిరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది.
కాగా, ఈ చిత్రంలో సాయితేజ్ కి జంటగా కేరళకుట్టి సంయుక్తా మీనన్ నటించనుందని సమాచారం. ఇప్పటికే పలు మలయాళ చిత్రాల్లో అభినయానికి అవకాశమున్న పాత్రల్లో అలరించిన సంయుక్త.. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ కి జోడీగా ఓ తెలుగు సినిమా చేస్తోంది. ఆ చిత్రం నిర్మాణ దశలో ఉన్నప్పుడే సాయితేజ్ సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది సంయుక్త. మరి.. తెలుగులో వరుస అవకాశాలతో ముందుకు సాగుతున్న సంయుక్త.. కళ్యాణ్ రామ్, సాయితేజ్ చిత్రాలతో ఎలాంటి గుర్తింపుని పొందుతుందో చూడాలి.
![]() |
![]() |