![]() |
![]() |

కింగ్ నాగార్జున, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కాజల్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఓ ఆంగ్ల దినపత్రికకు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు ప్రవీణ్ సత్తారు. ఇందులో `రా` ఏజెంట్ గా కాజల్ కనిపిస్తుందని.. నెవర్ సీన్ బిఫోర్ లుక్, బాడీ లాంగ్వేజ్ తో తను సర్ ప్రైజ్ చేయబోతోందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్ కి సంబంధించి ఈ తర్ఫీదు ఉంటుందని ఆయన వెల్లడించారు. అలాగే, మార్చి నెలాఖరు నుంచి కాజల్ చిత్రీకరణలో పాల్గొనబోతోందని అన్నారు. మరి.. కొత్త తరహా పాత్రలో కాజల్ ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. కాజల్ తాజా చిత్రం `మోసగాళ్ళు` శుక్రవారం జనం ముందుకొచ్చింది. ఇక మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటిస్తున్న `ఆచార్య` మే 13న థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |