![]() |
![]() |

యువ సామ్రాట్ నాగచైతన్య చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 'లవ్ స్టోరి' కాగా.. మరొకటి 'థాంక్ యూ'. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న 'లవ్ స్టోరి' ఏప్రిల్ 16న థియేటర్స్ లోకి రానుండగా.. వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ తెరకెక్కిస్తున్న 'థాంక్ యూ' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా నాగచైతన్య ఓ బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్' ఆధారంగా బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్ఢా' పేరుతో ఓ హిందీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరీనా కపూర్ నాయికగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
కాగా, ఇందులో ఓ కీలక పాత్ర కోసం తొలుత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంచుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి విజయ్ తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ఈ పాత్ర చైతూని వరించిందని బాలీవుడ్ బజ్. అంతేకాదు.. మే నుంచి చైతూ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారని టాక్. త్వరలోనే 'లాల్ సింగ్ చడ్ఢా'లో చైతూ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, డిసెంబర్ 24న 'లాల్ సింగ్ చడ్ఢా' థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |