![]() |
![]() |

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ పాత్రధారులుగా, పిట్టగోడ ఫేమ్ అనుదీప్ కె.వి. డైరెక్ట్ చేసిన 'జాతిరత్నాలు' మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ సినిమా రూ. 3.95 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ప్రి బిజినెస్‌తో పోలిస్తే 41 శాతం పైగా రికవరీ సాధించింది. 'జాతిరత్నాలు' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 9.45 కోట్లని అంచనా. ఒక చిన్న సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ కావడం, ఓపెనింగ్స్ రావడం చిన్న విషయం కాదు.
స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు విడుదలకు ముందు సోషల్ మీడియాలో అసాధారణ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌కు తగ్గట్లే ఓపెనింగ్స్ ఉండటం గమనార్హం. నైజాంలో రూ. 3.15 కోట్ల మేరకు బిజినెస్ జరగగా, తొలి రోజు రూ. 1.42 కోట్ల షేర్ వచ్చింది. రికవరీ 45 శాతం. ఆంధ్రా ఏరియాలో రూ. 4.95 కోట్ల మేరకు బిజినెస్ జరిగితే, రూ. 1.95 కోట్ల షేర్ లభించింది. రికవరీ 39 శాతం. రాయలసీమలో రూ. 1.4 కోట్లకు ప్రి బిజినెస్ అయితే, మొదటి రోజు వచ్చింది రూ. 57 లక్షలు. రికవరీ 40.5 శాతం.
డైరెక్టర్ కల్పించిన సీన్లు, రాసిన డైలాగులు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కలిసి 'జాతిరత్నాలు'ను హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మార్చాయి. 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' మూవీ తర్వాత, దానికి మించి 'జాతిరత్నాలు' సినిమా నవీన్ పోలిశెట్టికి పెద్ద పేరు తెచ్చింది.
![]() |
![]() |