![]() |
![]() |

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న యువ కథానాయకుల్లో నాగశౌర్య ఒకరు. `లక్ష్య`, `వరుడు కావలెను`, `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి`.. ఇలా పలు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు శౌర్య. అంతేకాదు.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నూతన దర్శకుడు కె.పి. రాజేంద్ర తెరకెక్కించనున్న సినిమాలోనూ నటించనున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. `పోలీసువారి హెచ్చరిక` పేరుతో రూపొందనున్న ఈ చిత్రం.. నాగశౌర్యకి 23వ సినిమా కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. `పోలీసువారి హెచ్చరిక`లో నాగశౌర్యకి జోడీగా దివ్యాంశ కౌశిక్ ఎంపికైంది. ఇదవరకు ఈ ముద్దుగుమ్మ.. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా నటించిన `మజిలీ`లో సెకండ్ లీడ్ గా నటించింది. చైతూ లవ్ ఇంట్రస్ట్ రోల్ లో కుర్రకారుని ఫిదా చేసింది. శౌర్యతో చేయబోతున్న సినిమాలోనూ తనకు పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ దక్కిందని టాక్. ఏప్రిల్ నుంచి `పోలీసువారి హెచ్చరిక`కి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కానుంది.
మరి.. `మజిలీ`లాగే `పోలీసువారి హెచ్చరిక`తోనూ దివ్యాంశ నటిగా మెప్పిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |